Sanchaita: చంద్రబాబు, అశోక్ గజపతి మా తాత గారి పేరుప్రతిష్ఠలను వాడుకున్నారు: సంచయిత

Sanchaita alleges Chandrababu and Asok Gajapati en cashed her grandfather reputaion
  • చంద్రబాబు విజయనగరాన్ని విస్మరించాడంటూ విజయసాయి ట్వీట్
  • విజయసాయి ట్వీట్ ను పంచుకున్న సంచయిత
  • జగన్ బ్లూప్రింట్ అద్భుతమని కితాబు
సింహాచలం దేవస్థానం ట్రస్టు చైర్ పర్సన్ సంచయిత టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజులపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. "నాడు అధికారంలో ఉన్నా గానీ చంద్రబాబు, అశోక్ గజపతి విజయనగరం అభివృద్ధి పట్ల ఎలా నిర్లక్ష్యం వహించారో మరిన్ని ఆధారాలు లభించాయి" అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా, 'చంద్రబాబు విజయనగరాన్ని విస్మరించాడు' అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ను సంచయిత పంచుకున్నారు.

"విజయనగరాన్ని అభివృద్ధి చేయడానికి బదులు, మా తాత పీవీజీ రాజు గారి పేరుప్రఖ్యాతులను, ప్రతిష్ఠలను ఉపయోగించుకుని లబ్ది పొందారు. కానీ విజయనగరం, వైజాగ్ లను జంటనగరాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ సిద్ధం చేసిన బ్లూప్రింట్ అద్భుతంగా ఉంది. అందుకే వారికి నీరాజనాలు పలుకుతున్నాను" అంటూ సంచయిత ట్వీట్ చేశారు.
Sanchaita
Chandrababu
Asok Gajapathi
Vijayanagaram
Jagan
Vijay Sai Reddy
Andhra Pradesh

More Telugu News