Malla Reddy: నేను పూర్తిగా కోలుకున్నాను: మంత్రి మల్లారెడ్డి

Malla Reddy releases a video stating he recovered from Corona Virus
  • గత ఆదివారం కోవిడ్ టెస్ట్ చేయించుకున్నా
  • ఇప్పుడు పూర్తిగా కోలుకున్నా
  • ధైర్యంగా ఉంటే కరోనా నుంచి కోలుకోవచ్చు
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో, ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. గత ఆదివారం నాడు కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ అని తేలిందని మల్లారెడ్డి చెప్పారు. అప్పటి నుంచి తాను సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నానని తెలిపారు.

ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకున్నానని, ఇప్పుడు తనకు ఎలాంటి సింప్టమ్స్ లేవని చెప్పారు. మెడిసిన్ తీసుకుంటూ  ధైర్యంగా ఉంటే కరోనా నుంచి కోలుకోవచ్చని తెలిపారు. అయితే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ, కరోనా సోకకుండా చూసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ లో ఇప్పటికే  పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
Malla Reddy
TRS
Corona Virus

More Telugu News