Malla Reddy: తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్

Telangana Minister Malla Reddy tests with Corona positive
  • కరోనా బారిన పడుతున్న ప్రజాప్రతినిధులు
  • మల్లారెడ్డి భార్యకు కూడా కరోనా
  • మల్లారెడ్డి కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు
తెలంగాణలో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తదితరులు కరోనా బారిన పడి కోలుకున్నారు. మంత్రి మల్లారెడ్డికి కూడా కరోనా వచ్చినట్టు ఆలస్యంగా తెలిసింది. ఆయన భార్య సైతం కరోనా బారిన పడ్డారు. వైద్యుల సలహా మేరకు వీరు గత కొన్ని రోజులుగా ఐసొలేషన్ లో ఉన్నారు. మరోవైపు మల్లారెడ్డి కుటుంబసభ్యులకు, ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారికి కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 77 వేలను దాటింది. 600కు పైగా మరణాలు సంభవించాయి. కరోనా నుంచి కోలుకుని 54,330 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Malla Reddy
Corona Virus
TRS

More Telugu News