Akshay Kumar: పర్మినెంట్ లాక్ డౌన్ కు ఇదే అసలైన మార్గం: రానా పెళ్లిపై స్పందించిన అక్షయ్ కుమార్

Akshay Kumar comments on Rana Daggubati marriage with Miheeka Bajaj
  • ఇవాళ రానా, మిహీకా బజాజ్ ల పెళ్లి
  • రామానాయుడు స్టూడియోస్ వేదికగా వివాహం
  • శుభాకాంక్షలు తెలిపిన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్
టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ ల పెళ్లిపై బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్పందించారు. శాశ్వతంగా లాక్ డౌన్ అవడానికి ఇదే సిసలైన మార్గం అంటూ ట్వీట్ చేశారు. "రానా దగ్గుబాటి... శుభాకాంక్షలు, మీ జంట జీవితకాలం ఆనందంతో తులతూగాలని ఆకాంక్షిస్తున్నాను" అని పేర్కొన్నారు. కాగా, రానా, మిహీకాల పెళ్లి హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్ లో జరగనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ వివాహానికి పరిమిత సంఖ్యలో ఆహ్వానాలు పంపినట్టు తెలుస్తోంది.
Akshay Kumar
Rana Daggubati
Miheeka Bajaj
Wedding
Ramanaidu Studios

More Telugu News