India: వరుసగా  నాలుగో రోజు... అమెరికా, బ్రెజిల్ దేశాలను అధిగమించిన ఇండియా!

India Reports More Cases Than US and Brazil For 4th Consecutive Day
  • గత 24 గంటల్లో 61,537 కొత్త కేసులు
  • 20,88,611కి చేరిన కేసుల సంఖ్య
  • మూడో స్థానంలో ఏపీ
ఇండియాలో కరోనా కేసులు ఆరోజుకారోజు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 61,537 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,88,611కి చేరింది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు మొత్తం 14.27 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు  ఒకే రోజులో అత్యధిక కేసులు నమోదైన దేశంగా ఇండియా వరుసగా నాలుగో రోజు రికార్డులకెక్కింది. ఈ విషయంలో అమెరికా, బ్రెజిల్ దేశాలను అధిగమించింది.

మరోవైపు ఇండియాలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకు 42 వేలకు పైగా జనాలు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
India
Corona Virus
cases

More Telugu News