Narendra Modi: ప్రజల్లో మోదీకి తగ్గని ఆదరణ.. మళ్లీ మోదీనే ప్రధాని: తాజా సర్వే

66 percent people in India wanted to be the Modi will be next PM
  • తదుపరి ప్రధానిగా మోదీనే ఉండాలని కోరుకున్న 66 శాతం మంది
  • రాహుల్ గాంధీకి 8 శాతం, సోనియాకు 5 శాతం మంది మద్దతు
  • ఇండియా టుడే-కార్వీ ఇన్‌సైట్స్ సర్వేలో వెల్లడి
ప్రధాని నరేంద్రమోదీకి ప్రజల్లో ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని, తదుపరి ప్రధానిగా కూడా ఆయనే కొనసాగాలని దేశ ప్రజలు కోరుకుంటున్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. ప్రధాని విషయంలో మోదీకి, రాహుల్ గాంధీకి మధ్య అంచనాకు అందనంత దూరం ఉండడం గమనార్హం. వచ్చేసారి కూడా మోదీనే ప్రధానిగా ఉండాలని 66 శాతం మంది ప్రజలు కోరుకోగా, ఈ విషయంలో కేవలం 8 శాతం మంది మాత్రమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఓటేశారు. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కేవలం 5 శాతం మందే ఓటు వేయడం గమనార్హం.

ఇండియా టుడే-కార్వీ ఇన్‌సైట్స్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట చేపట్టిన ఈ సర్వే తదుపరి ప్రధాని ప్రాధాన్య జాబితాలో  కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ప్రియాంక గాంధీ, రాజ్‌నాథ్ సింగ్, ఉద్ధవ్ థాకరే, మాయావతి, అఖిలేశ్ యాదవ్‌కు చోటు లభించింది. అయితే, వీరిలో ఒక్క అమిత్ షా ఒక్కరికే 4 శాతం ఓట్లు రాగా, మిగతా అందరికీ ఆలోపే రావడం గమనార్హం. ఈ ఏడాది జులై 15 నుంచి జులై 27 మధ్య 12,021 మందిని టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ సర్వే నిర్వహించారు.
Narendra Modi
Rahul Gandhi
Sonia Gandhi
India today mood of the nation survey

More Telugu News