విమాన ప్ర‌మాద ఘ‌ట‌న‌పై మ‌హేశ్ బాబు, బ‌న్నీ దిగ్భ్రాంతి

Sat, Aug 08, 2020, 10:03 AM
mahesh bunny Condolences to demised
  • కేరళలోని కోజికోడ్ లో విమాన ప్రమాదం
  • త‌న‌ను ఎంత‌గానో  కలచి వేసిందని మ‌హేశ్, విషాదాన్ని నింపింద‌ని అల్లు అర్జున్ వ్యాఖ్య
  • గాయాల‌పాలైన‌ వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని  ఆకాంక్ష‌
కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో జరిగిన విమాన ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో 100 మందికి పైగా ప్ర‌యాణికులు గాయాల‌పాల‌య్యారు. ఈ ఘ‌ట‌నపై సినీన‌టులు మ‌హేశ్ బాబు, అల్లు అర్జున్ స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ ప్రమాద ఘటన త‌న‌ను ఎంత‌గానో  కలచి వేసిందని మ‌హేశ్ బాబు ట్వీట్ చేశాడు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నానని అన్నాడు. గాయాల‌పాలైన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న‌ట్లు చెప్పాడు.
 
కేర‌ళ‌లో జ‌రిగిన ఈ విమాన‌ ప్ర‌మాదం విషాదాన్ని నింపింద‌ని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. కోజికోడ్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న గురించి తెలుసుకుని షాక్ అయ్యాన‌ని చెప్పాడు. ఈ ప్ర‌మాదంలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపాడు. గాయాల‌పాలైన‌ వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్న‌ట్లు పేర్కొన్నాడు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha