సమంతతో కలసి నటించనున్న రష్మిక!

Sat, Aug 08, 2020, 09:13 AM
Rashmika and Samantha act together in a movie
  • అక్కాచెల్లెళ్ల కథతో సంప్రదించిన దర్శకుడు 
  • వెంటనే ఓకే చెప్పిన ముద్దుగుమ్మలు 
  • మహిళా ప్రధాన కథా చిత్రంగా నిర్మాణం 
పెళ్లయినా ఇంకా ఏమాత్రం గ్లామర్ కోల్పోని సమంత, టాలీవుడ్ హాట్ బ్యూటీ రష్మిక కలసి ఓ చిత్రంలో నటించనున్నారన్న వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రచారంలో వుంది. పైగా వీరిద్దరూ ఆ చిత్రంలో అక్కాచెల్లెళ్లుగా నటిస్తారన్నది మరింత ఆసక్తికరమైన విషయం.

ఇటీవల ఓ యువ దర్శకుడు అక్కాచెల్లెళ్ల కథతో సమంత, రష్మికలను సంప్రదించాడనీ, కథ వినగానే చేయడానికి ఇద్దరూ ఆనందంగా అంగీకరించారనీ తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఓ ప్రముఖ బ్యానర్ ముందుకు వచ్చినట్టు చెబుతున్నారు. ఇది మహిళా ప్రధాన చిత్రంగా రూపొందుతుందట.  

కాగా, ప్రస్తుతం 'ఫ్యామిలీ మెన్ -2' వెబ్ సీరీస్ లో నటిస్తున్న సమంత తమిళంలో రెండు సినిమాలలో నటిస్తోంది. ఇక రష్మిక అయితే అల్లు అర్జున్ సరసన నటిస్తున్న 'పుష్ప' సినిమాతో పాటు కన్నడ, తమిళ భాషల్లో చెరో సినిమాలో నటిస్తోంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha