'వినాయకుడు' ఫేమ్ కృష్ణుడికి ప్రభాస్ అభినందనలు

07-08-2020 Fri 21:58
  • నిర్మాతగా మారిన కృష్ణుడు
  • కుమార్తె నిత్యా పేరుమీద బ్యానర్ ఏర్పాటు
  • సొంత బ్యానర్ లో 'మై బాయ్ ఫ్రెండ్స్ గాళ్ ఫ్రెండ్' చిత్రం
Prabhas appreciated Vinayakudu fame Krishnudu on his debut as a producer
లావుపాటి శరీరంతోనూ హీరోయిజం పండించొచ్చని నిరూపించిన నటుడు కృష్ణుడు. వినాయకుడు చిత్రంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు ఇప్పుడు నిర్మాతగా మారి 'మై బాయ్ ఫ్రెండ్స్ గాళ్ ఫ్రెండ్' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను అగ్రహీరో ప్రభాస్ ఆవిష్కరించారు. నిర్మాతగా కెరీర్ స్టార్ట్ చేసిన కృష్ణుడికి అభినందనలు తెలిపారు. కొత్త రోల్ లోనూ విజయాన్నందుకోవాలని, నిర్మాతగా సక్సెస్ ఫుల్ చిత్రాలు తీయాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

కాగా, కృష్ణుడు తన కుమార్తె నిత్యా పేరు మీద నిత్యా క్రియేషన్స్ బ్యానర్ స్థాపించారు. 'మై బాయ్ ఫ్రెండ్స్ గాళ్ ఫ్రెండ్' చిత్రం ద్వారా లోతుగడ్డ జయరామ్ దర్శకుడిగా అరంగేట్రం చేయనున్నాడు. ఇదొక ముక్కోణపు కామెడీ ప్రేమకథా చిత్రం. ఇది తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని కృష్ణుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు.