కేరళ కోజికోడ్ విమానాశ్రయంలో రెండు ముక్కలైన విమానం... పైలెట్ సహా ఇద్దరి మృతి

Fri, Aug 07, 2020, 09:26 PM
Plane crashes at Kozhikode airport as pilot died
  • ల్యాండింగ్ ప్రయత్నంలో రన్ వే నుంచి జారిన విమానం
  • ప్రమాదంలో విమానం ధ్వంసం
  • దుబాయ్ నుంచి కోజికోడ్ వచ్చిన విమానం
  • విమానంలో 180 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది
భారీ వర్షాలతో అల్లాడిపోతున్న కేరళలో విమాన ప్రమాదం జరిగింది. కోజికోడ్ విమానాశ్రయంలో ఎయిరిండియాకు చెందిన బోయింగ్ విమానం రన్ వేపై నుంచి జారిపోయి రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో విమాన పైలెట్ సహా ఇద్దరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.

దుబాయ్ నుంచి కోజికోడ్ వచ్చిన ఈ విమానం ల్యాండింగ్ కు ప్రయత్నిస్తున్న సమయంలో రన్ వే పై నుంచి జారిపోయింది. ప్రమాదంలో ఈ బోయింగ్ విమానం ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం కోజికోడ్ విమానాశ్రయంలో సహాయక చర్యలు జరుగుతున్నాయి. గాయపడిన వారిని కోజికోడ్ లోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha