Nara Lokesh: జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన నారా లోకేశ్

Nara Lokesh slams CM Jagan in the wake of JC Prabhakar Reddy arrest
  • జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అక్రమం అంటూ వ్యాఖ్యలు
  • జగన్ సైకో ఆనందం పొందుతున్నారని వెల్లడి
  • నీచ స్థితికి దిగజారిపోయారంటూ విమర్శలు
  • నేరస్వభావం ఉన్న వ్యక్తి చేతిలో అధికారం ఉందన్న లోకేశ్
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు మళ్లీ అరెస్ట్ చేయడం పట్ల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. నేర స్వభావం ఉన్న జగన్ వంటి వ్యక్తి చేతిలో అధికారం ఉంటే ఎంత ప్రమాదమో చూస్తున్నామని వ్యాఖ్యానించారు.

కరోనాను కూడా కక్ష సాధింపు కోసం వాడుకునే నీచ స్థితికి జగన్ దిగజారిపోయారని విమర్శించారు. కరోనా పేరుతో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ లను అరెస్ట్ చేశారని, ఈ అక్రమ అరెస్ట్ లను తీవ్రంగా ఖండిస్తున్నట్టు లోకేశ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. విడుదలైన 24 గంటల్లోపే మళ్లీ జైల్లో పెట్టానని జగన్ సైకో ఆనందం పొందుతున్నారని, కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ధ ప్రజలపై పెట్టి ఉంటే ఈ రోజు ప్రజలకు ఇన్ని కష్టాలు ఉండేవి కావని అభిప్రాయపడ్డారు.
Nara Lokesh
JC Prabhakar Reddy
Arrest
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News