Naga Chaitanya: కరోనా నుంచి కోలుకున్న నర్సు సునీతతో మాట్లాడాను... ఆమె మాటలు ఎంతో స్ఫూర్తిదాయకం: నాగచైతన్య

Naga Chaitanya talks to corona cured nurse Sunitha
  • ఫేస్ బుక్ లో శేఖర్ కమ్ముల చర్చా కార్యక్రమం
  • కరోనాను జయించిన వ్యక్తులతో చర్చ
  • ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న నాగచైతన్య
ఇటీవల దర్శకుడు శేఖర్ కమ్ముల ఫేస్ బుక్ లో ఓ వినూత్న కార్యక్రమానికి నాంది పలికారు. కరోనాను జయించిన వ్యక్తులతో ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడించడం ద్వారా ప్రజల్లో కరోనా అంటే ఉన్న భయం పోగొట్టాలని శేఖర్ కమ్ముల ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువ హీరో నాగచైతన్యను నామినేట్ చేయగా, నాగచైతన్య కరోనా నుంచి కోలుకున్న సునీత అనే నర్సుతో మాట్లాడారు. సునీత మాటల్లో ధ్వనించిన ఆత్మస్థైర్యానికి నాగచైతన్య ఎంతో ముగ్ధులయ్యారు.

దీనిపై నాగచైతన్య స్పందిస్తూ, సునీత అనే నర్సుతో గతవారం మాట్లాడానని, ఆమె మాటలు ఎంతో స్ఫూర్తి కలిగించే విధంగా ఉన్నాయని, ఇతరులకు ఉపయుక్తంగా ఉన్నాయని తెలిపారు. కరోనా సోకిందని తెలియగానే భయపడతారని, వాస్తవానికి ఈ భయం వల్లనే అనేక సమస్యలు వస్తుంటాయని అన్నారు. వైరస్ సోకిన విషయం కూడా ఈ భయంతోనే బయటికి చెప్పుకోలేక పోతున్నారని, ఈ పరిస్థితి ప్రాణాల మీదికి తెస్తోందని నాగచైతన్య అభిప్రాయపడ్డారు. కరోనాపై పోరాటంలో ముందు భయాన్ని జయించాలని స్పష్టం చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా దర్శకుడు సుకుమార్ ను నామినేట్ చేశారు.
Naga Chaitanya
Sunitha
Nurse
Corona Virus
Sekhar Kammula
Facebook

More Telugu News