Corona Virus: కరోనా వ్యాక్సిన్ ధర వెల్లడించిన సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా

  • మూడు డాలర్లకు కరోనా వ్యాక్సిన్
  • ఆక్స్ ఫర్డ్, నోవామ్యాక్స్ వ్యాక్సిన్ లను ఉత్పత్తి చేయనున్న ఎస్ఐఐ
  • 100 మిలియన్ డోసులు ఉత్పత్తి చేయడమే లక్ష్యం
Serum Institute of India reveals corona vaccine price

ప్రపంచవ్యాప్తంగా పలు కరోనా వ్యాక్సిన్లు మానవ ప్రయోగాల దశలో ఉన్నాయి. వాటిలో కొన్ని వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు భారత్ లోని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించే కొవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా సీరమ్ ఇన్ స్టిట్యూట్ లోనే ఉత్పత్తి కానుంది. ఈ క్రమంలో తాము ఉత్పత్తి చేయబోయే కరోనా వ్యాక్సిన్ ధరను ఎస్ఐఐ సీఈఓ అడార్ పూనావాలా వెల్లడించారు. ఈ కరోనా వ్యాక్సిన్ ధర 3 డాలర్లుగా నిర్ణయించామని తెలిపారు.

ఆక్స్ ఫర్డ్ వర్సిటీ అభివృద్ధి చేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను, నోవామాక్స్ కు చెందిన మరో కరోనా వ్యాక్సిన్ ను తామే ఉత్పత్తి చేస్తున్నామని, అందుకోసం బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, గవి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని పూనావాలా వెల్లడించారు. ఈ రెండు వ్యాక్సిన్ లను 100 మిలియన్ డోసులను తయారుచేసి భారత్ సహా, అనేక ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తామని, ఈ వ్యాక్సిన్ ల తయారీ కోసం గేట్స్ ఫౌండేషన్ నుంచి తమకు 150 మిలియన్ డాలర్ల మూలధనం అందనుందని వివరించారు.

More Telugu News