వరలక్ష్మి పూజను బాగా ఆస్వాదించాను... థాంక్స్ అత్తమ్మా!: ఉపాసన

Fri, Aug 07, 2020, 05:56 PM
Upasana says she was well enjoyed Varalakshmi puja
  • వరలక్ష్మి పూజ నిర్వహించిన ఉపాసన
  • శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేకపూజలు
  • ఇది తనకెంతో ప్రత్యేకం అని పేర్కొన్న ఉపాసన
ఇది శ్రావణమాసం కావడంతో మహిళలకు ప్రతి దినమూ పవిత్రమైనదే. వరలక్ష్మి అమ్మవారికి రకరకాల పూజలు, నైవేద్యాలతో పూజాదికాలు, ఆరాధనలు నిర్వహించడం ఈ మాసంలో సాధారణమైన విషయం. టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన కూడా వరలక్ష్మి పూజ నిర్వహించారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

"వరలక్ష్మి అమ్మవారి పూజను నిజంగా ఎంతో ఆస్వాదించాను. అందుకు రామ్ చరణ్ కు, మా అత్తమ్మకు, డాక్టర్ సంగీతారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ పూజను ఎంతో ప్రత్యేకంగా మలిచినందుకు వారికి ధన్యవాదాలు. ఎంతో సంతృప్తిగా ఉంది. మనందరిపైనా ఆ వరలక్ష్మి అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను" అంటూ ఉపాసన ట్వీట్ చేశారు.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha