Saranya: బెంగళూరులో తెలుగు ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద మృతి

Kamareddy girl died in suspicious conditions at her Bengaluru residence
  • కామారెడ్డికి చెందిన శరణ్య అనుమానాస్పద మృతి
  • తన ఇంట్లో విగతజీవిగా పడివున్న శరణ్య
  • అల్లుడిపై ఆరోపణలు చేస్తున్న శరణ్య తల్లిదండ్రులు
కామారెడ్డి ప్రాంతానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బెంగళూరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కామారెడ్డికి చెందిన 25 ఏళ్ల శరణ్య బెంగళూరులోని ఓ సంస్థలో పనిచేస్తోంది. శరణ్యది ప్రేమవివాహం. తనతో పాటు కలిసి చదివిన రోహిత్ ను ప్రేమించి పెళ్లాడింది. రోహిత్, శరణ్య బెంగళూరులోనే ఉంటున్నారు. అయితే, తన ఇంట్లో శరణ్య విగతజీవిగా పడివుండగా, ఆ సమాచారం అందుకున్న ఆమె తల్లిదండ్రులు వెంటనే బెంగళూరు పయనమయ్యారు.

తమ కుమార్తె మరణానికి అల్లుడు రోహితే కారణమని ఆరోపిస్తున్నారు. అతడు హత్య చేయడమో, లేక ఆత్మహత్య చేసుకునేంత స్థాయిలో వేధించడమో కారణం అయ్యుంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లయిన కొన్నాళ్లకే రోహిత్ తమ కుమార్తెపై చేయి చేసుకునేవాడని వారు వెల్లడించారు. ఇటీవలే శరణ్య పుట్టింటికి వస్తే, పెద్ద మనుషుల సమక్షంలో రోహిత్ తప్పు ఒప్పుకున్నాడని, అతడు మారాడని భావించి శరణ్యను మళ్లీ కాపురానికి పంపామని వివరించారు. ఇంతలోనే తమ కుమార్తె మరణ వార్తను వినాల్సి వస్తుందనుకోలేదని వారు కన్నీటి పర్యంతమయ్యారు.
Saranya
Death
Bengaluru
Kamareddy
Telangana

More Telugu News