Nellore District: కావలిలో కరోనా మరణ మృదంగం.. రేపటి నుంచి స్వచ్ఛంద లాక్ డౌన్

Kavali lockdown from tomorrow
  • కావలిలో ఏడుగురు వ్యాపారుల మృతి
  • కరోనా కట్టడికి సిద్ధమైన వ్యాపార వర్గాలు
  • రేపటి నుంచి 10 రోజుల లాక్ డౌన్
ఏపీలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే సుమారు 2 లక్షల కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో సైతం కరోరా పంజా విసురుతోంది. జిల్లాలోని కావలిలో ఏకంగా ఏడుగురు వ్యాపారులు కరోనా కారణంగా మృతి చెందడంతో జనాలు భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు అక్కడి వ్యాపార వర్గాలు సిద్ధమయ్యాయి. రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజలంతా తమ వంతుగా లాక్ డౌన్ కు సహకరించాలని విన్నవించారు.


Nellore District
Kavali
Lockdown

More Telugu News