Sensex: కరోనా ఉద్ధృతి ప్రభావం.. ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు!

  • 15 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
  • 14 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • నష్టపోయిన ఐటీ సూచీ
Stock markets ends in flat mode

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. మన దేశంలో కరోనా కేసులు 20 లక్షలు దాటిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అవలంబించారు. బ్యాంకింగ్, ఫైనాన్సియల్, మెటల్ స్టాకులు లాభాలను మూటకట్టుకోగా... ఐటీ, ఫార్మా నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 15 పాయింట్లు లాభపడి 38,041కి చేరింది. నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 11,214 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (4.45%), బజాజ్ ఫైనాన్స్ (3.61%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.90%), మారుతి సుజుకి (1.84%), ఓఎన్జీసీ (0.90%).

టాప్ లూజర్స్:
టైటాన్ కంపెనీ (-2.65%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.22%), ఇన్ఫోసిస్ (-1.90%), సన్ ఫార్మా (-1.26%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.07%).

More Telugu News