NB Chakravarthi: టాలీవుడ్ సీనియర్ దర్శకుడు ఎన్.బి.చక్రవర్తి కన్నుమూత

Tollywood senior director NB Chakravarthi is no more
  • అనారోగ్యంతో కన్నుమూసిన దర్శకుడు
  • గతంలో అనేక హిట్ చిత్రాలకు దర్శకత్వం
  • కాష్మోరాతో పాటు అనేక చిత్రాలకు డైరెక్షన్
తెలుగులో అనేక హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సీనియర్ దర్శకుడు ఎన్.బి.చక్రవర్తి ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన  అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఎన్.బి.చక్రవర్తి సంపూర్ణ ప్రేమాయణం (శోభన్ బాబు), కత్తుల కొండయ్య, నిప్పులాంటి మనిషి (నందమూరి బాలకృష్ణ), కాష్మోరా (రాజేంద్రప్రసాద్, రాజశేఖర్) వంటి చిత్రాలు తెరకెక్కించారు. సీనియర్ దర్శకుడి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
NB Chakravarthi
Director
Death
Tollywood

More Telugu News