Narendra Modi: ఒకే దేశం - ఒకే విద్యా విధానం: మోదీ

One Nation One Educaion is the motto of new Education Policy says Modi
  • కొత్త విద్యా విధానంలో సమూల మార్పులు
  • పిల్లల్లో చదువుకోవాలనే  కోరిక పెరుగుతుంది
  • కొత్త విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విద్యా విధానంతో విద్యా వ్యవస్థ రూపు రేఖలు మారిపోతాయని ప్రధాని మోదీ అన్నారు. విస్తృతమైన అధ్యయనం తర్వాతే ఈ విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఈ విద్యా విధానంపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరగాలని తెలిపారు. ఈ రోజు ఆయన ఈ విద్యా విధానంపై జాతిని ఉద్దేశించి మాట్లాడారు.

కొత్త విధానంతో పిల్లలపై పుస్తకాల భారం తగ్గుతుందని... ఇదే సమయంలో చదువుకోవాలన్న కోరిక వారిలో పెరుగుతుందని మోదీ చెప్పారు. పిల్లల్లో ఆలోచనా శక్తిని, సునిశిత పరిశీలనను పెంచేలా విద్యా విధానం ఉంటుందని  తెలిపారు. తమ లక్ష్యాలకు విద్యార్థులు చేరుకునేలా ఉపకరిస్తుందని చెప్పారు. నర్సరీ నుంచి పీజీ వరకు సమూలమైన మార్పులను తీసుకొచ్చామని తెలిపారు. ఒకే దేశం - ఒకే విద్యా విధానం ఉండాలనేదే జాతీయ విద్యా విధానం లక్ష్యమని చెప్పారు.

కొత్త విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ విధానం విద్యార్థుల నైపుణ్యాలపై దృష్టి పెడుతుందని చెప్పారు. కొత్త ఆవిష్కరణల దిశగా యువత ఆలోచనలు సాగాలని అన్నారు. కొత్త విద్యా విధానంపై ఎవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కోరారు.
Narendra Modi
BJP
New Education Policy

More Telugu News