Paruchuri Venkateshwara Rao: పరుచూరి వెంకటేశ్వరరావుకు భార్యా వియోగం!

Paruchuri Venkateshwararao Wife Died after Heart Attack
  • 74 ఏళ్ల వయసులో గుండెపోటు
  • ఈ తెల్లవారుజామున కన్నుమూత
  • సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు
ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు భార్య విజయలక్ష్మి ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. గుండెపోటుతో ఆమె మరణించినట్టు కుటుంబీకులు తెలిపారు. విజయలక్ష్మి మృతి విషయాన్ని తెలుసుకున్న పలువురు తెలుగు సినీ ప్రముఖులు పరుచూరి వెంకటేశ్వరరావుకు సంతాపాన్ని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఇంటికి చేరుకున్న పరుచూరి గోపాలకృష్ణ, సోదరుని ఓదార్చే ప్రయత్నం చేశారు. కాగా, పరుచూరి సోదరులుగా అశేష సినీ ప్రేక్షకులకు సుపరిచితులైన వీరిద్దరూ, అందరు స్టార్ హీరోలతోనూ పనిచేసి, ఎన్నో హిట్స్ అందించిన సంగతి తెలిసిందే.
Paruchuri Venkateshwara Rao
Vijayalakshmi
Passes away

More Telugu News