Srikar Bharat: నిరాడంబరంగా శ్రీకర్ భరత్ వివాహం... అభినందనలు తెలిపిన కోహ్లీ, రోహిత్, ఇషాంత్!
- విశాఖలో అంజలిని వివాహమాడిన శ్రీకర్
- అభినందనలు తెలిపిన పలువురు క్రికెటర్లు
- నిరాడంబరంగా సాగిన వేడుక
భారత క్రికెట్ జట్టు ఆటగాడు, రంజీల్లో తొలిసారిగా ట్రిపుల్ సెంచరీ చేసిన రికార్డును తన సొంతం చేసుకున్న శ్రీకర్ భరత్ వివాహం నిరాడంబరంగా సాగింది. నిన్న రాత్రి విశాఖపట్నంలో లాక్ డౌన్ నిబంధనలను అనుసరించి, కొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల మధ్య భరత్ వివాహం, పెద్దలు నిశ్చయించిన అంజలితో జరిగింది. ఓ స్టార్ హోటల్ లో ఈ కార్యక్రమం జరిగింది. గత సంవత్సరం నవంబర్ లో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా శ్రీకర్ భరత్ తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ని ఆడిన సంగతి తెలిసిందే.
తమ సహచరుడి వివాహం సందర్భంగా, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు, అతని సహచరులు రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, ఇషాంత్, మహమ్మద్ షమీ, ఛటేశ్వర్ పుజారా తదితరులతో పాటు రాహుల్ ద్రావిడ్ కూడా ఫోన్ చేసి శుభాభినందనలు తెలిపారు. ఇప్పటివరకూ 78 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లను ఆడిన శ్రీకర్ భరత్, 4,283 పరుగులు చేశాడు.