Nepal: చైనా చూపిన బాటలో నేపాల్ కుతంత్రాలు... భారత సరిహద్దుల్లో హెలిప్యాడ్ల నిర్మాణం

  • ఇటీవలే భారత్ భూభాగాలతో మ్యాప్ రూపొందించిన నేపాల్
  • తాజాగా సరిహద్దుల్లో హెలీప్యాడ్లతో మరో వివాదం
  • బీహార్ వద్ద రెండు, యూపీకి సమీపంలో ఒక హెలిప్యాడ్ నిర్మాణం
Nepal constructs three new helipads at India border

అరుణాచల్ ప్రదేశ్ లోని భాగాలను తనవిగా పేర్కొంటూ చైనా తన దేశ మ్యాప్ రూపొందించగా, ఇటీవలే నేపాల్ కూడా భారత భూభాగాలతో కూడిన కొత్త మ్యాప్ తయారుచేసింది. అంతేకాదు, ఇప్పుడు ఏకంగా భారత సరిహద్దుల్లో మూడు హెలీప్యాడ్లు నిర్మిస్తూ కొత్త వివాదానికి ఆజ్యం పోస్తోంది. బీహార్ సరిహద్దుల్లోని నసరాహీ, త్రివేణి ప్రాంతాల్లో రెండు, ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్ గంజ్ జిల్లా సరిహద్దులకు సమీపంలో మరొకటి నిర్మిస్తోంది. అయితే, ఈ అంశాన్ని భారత సశస్త్ర సీమాబల్ జవాన్లు తమ ఉన్నతాధికారులకు నివేదించారు. అంతేకాదు, నేపాల్ సరిహద్దుల్లో  గస్తీ ముమ్మరం చేశారు. ఇటీవలే చైనా... లడఖ్ వద్ద అక్రమ నిర్మాణాలు చేపట్టి, ఎల్ఏసీ వద్దకు చొచ్చుకురావడం తెలిసిందే. పాకిస్థాన్ సైతం భారత సౌర్వభౌమత్వాన్ని అవమానించేలా భారత భూభాగాలతో మ్యాప్ తయారుచేసింది.

More Telugu News