Gadde Rammohan: వైసీపీ నాయకులకు సిగ్గుండాలి: గద్దె రామ్మోహన్

AP people will teach a lesson to Jagan says Gadde Rammohan
  • జగన్ తుగ్లక్ నిర్ణయాలతో ప్రజలు నష్టపోతున్నారు
  • జగన్ అడ్రస్ లేకుండా పోతారు
  • జగన్ తానా అంటే.. మంత్రులు తందానా అంటున్నారు
రాష్ట్ర ప్రజలు అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారని... వారిని వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు వైసీపీ ద్రోహం చేస్తోందని అన్నారు. మాట్లాడేందుకు చంద్రబాబుకు స్థాయి లేదని వైసీపీ నేతలు అంటున్నారని... ఈ మాట అనడానికి వారికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలిపోతున్నా... జగన్ కు చెప్పే ధైర్యం వైసీపీ నేతలకు లేదని విమర్శించారు.

జగన్ తానా అంటే మంత్రులంతా తందానా అంటున్నారని మండిపడ్డారు. వాస్తవ పరిస్థితిని జగన్ కు చెప్పలేని దుస్థితిలో ఉన్నారని అన్నారు. జగన్ తుగ్లక్ నిర్ణయాలతో ప్రజలు నష్టపోతున్నారని... ప్రజలు శిక్షించే రోజు దగ్గర్లోనే ఉందని, జగన్ అడ్రస్ లేకుండా పోతారని చెప్పారు.
Gadde Rammohan
Chandrababu
Telugudesam
Jagan

More Telugu News