Navneet Kaur: నవనీత్ కౌర్ కు కరోనా పాజిటివ్

Navneet Kaur tests corona positive
  • నవనీత్ ఇంట్లోని 11 మందికి కరోనా
  • మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఎంపీగా గెలుపొందిన నవనీత్
  • ఇంటి ప్రాంతాన్ని శానిటైజ్ చేసిన అధికారులు
సామాన్యుడి దగ్గర నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఎందరో రాజకీయవేత్తలు, సినీ ప్రముఖులు, వాణిజ్యవేత్తలు కరోనా బారిన పడ్డారు. తాజాగా సినీనటి, మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆమె ఇంట్లో ఉన్న 11 మంది కుటుంబసభ్యులు కరోనా బారిన పడ్డారు.

వీరి ఇంట్లో తొలుత నవనీత్ కౌర్ మామ గంగాధర్ రానాకు కరోనా సోకింది. ఆ తర్వాత ఇతరులు కూడా దీని బారిన పడ్డారు. ఆమె ఇంటి ప్రాంతాన్ని ఆరోగ్యశాఖ శానిటైజ్ చేయించింది. నవనీత్ కు కరోనా పాజిటివ్ రావడంతో... ఆమె అనుచరులకు కూడా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
Navneet Kaur
Tollywood
Corona Positive

More Telugu News