Mahesh Babu: తమిళ దర్శకుడితో మహేశ్ బాబు సినిమా?

Lokesh to direct Mahesh Babu
  • విజయ్ తో 'మాస్టర్' చేసిన లోకేశ్ కనగరాజ్
  • మహేశ్ బాబుతో తాజాగా సంప్రదింపులు
  • మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో సినిమా
ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్న మహేశ్ బాబు త్వరలో ఓ తమిళ దర్శకుడితో ఓ సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది. తాజాగా విజయ్ హీరోగా 'మాస్టర్' చిత్రాన్ని రూపొందించిన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మహేశ్ నటించవచ్చని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నట్టు సమాచారం.

'సర్కారు వారి పాట' చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇటీవలే లోకేశ్ కనగరాజ్ తో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అది మహేశ్ తో నిర్మించే చిత్రం కోసమేనని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. మరోపక్క, రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ ఓ సినిమా చేయాల్సివుంది. రాజమౌళి తదుపరి సినిమా మహేశ్ తోనే అన్న వార్త కూడా ఇప్పటికే అధికారికంగా వచ్చింది. అయితే, ఈ సినిమాకి కాస్త సమయం పట్టే అవకాశం ఉండడంతో, ఈ లోగా మహేశ్ తమిళ దర్శకుడు లోకేశ్ తో సినిమా పూర్తి చేస్తాడని అంటున్నారు.
Mahesh Babu
Lokesh Kanagaraj
Parashuram

More Telugu News