Chandrababu: 10 ఏళ్ల ముస్లిం బాలికపై అత్యాచారయత్నమా?... వీళ్లకు ఇంత ధైర్యం ఇచ్చింది ఎవరు?: చంద్రబాబు

Chandrababu questions how they dare to assault on a ten years old girl
  • రాజమండ్రి రూరల్ లో దారుణం అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు
  • చంపేస్తామంటూ బాధితురాలి కుటుంబసభ్యులను బెదిరిస్తున్నారని వెల్లడి
  • దిశ చట్టం అసలు అమల్లో ఉందా? లేదా? అంటూ ఆగ్రహం
రాజమండ్రి రూరల్ లో అభంశుభం తెలియని 10 ఏళ్ల ముస్లిం మైనర్ బాలికపై ముగ్గురు వైసీపీ మద్దతుదారులు అత్యాచారయత్నం చేశారంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. ఈ ఘటనను ఖండిస్తున్నట్టు తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామంటూ బాధితురాలి కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని, ఈ అరాచక మూకలకు ఇంత ధైర్యం ఇచ్చింది ఎవరు? అంటూ మండిపడ్డారు.

"16 ఏళ్ల దళిత బాలికపై 12 మంది సామూహిక అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందే వదిలేసిన దుర్ఘటన కళ్లముందే ఉంది. కర్నూలులో గిరిజన మహిళను భర్త కళ్లముందే అతిదారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు. దిశ చట్టం అసలుందా లేదా? పోలీసులు ఇప్పటికైనా నిద్రమత్తు వీడి నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలి" అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Chandrababu
Muslim Girl
Assault
Rajamandri
YSRCP
Police
Andhra Pradesh

More Telugu News