Rana: రానా, మిహీకాల పెళ్లి సందడి ప్రారంభం.. హల్దీ వేడుకలో మెరిసిన మిహీకా!

Ranas fiancee Miheeka shines in Haldi function
  • ఆగస్ట్ 8న రానా, మిహీకాల పెళ్లి
  • అట్టహాసంగా జరిగిన హల్దీ వేడుక
  • వివాహానికి హాజరుకానున్న కొద్ది మంది అతిథులు
టాలీవుడ్ హీరో రానా తన ప్రియురాలు మిహీకాబజాజ్ మెడలో మూడుముళ్లు వేయనున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 8న తన ప్రియురాలిని రానా పెళ్లాడనున్నాడు. వీరి పెళ్లి సందడి షురూ అయింది. వివాహానికి ముందు జరిగే హల్దీ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో మిహీకా పసుపు, ఆకుపచ్చ లెహంగాలో మెరిసిపోయింది. ఈ సందర్భంగా సీషెల్స్ డిజైనర్ ఆభరణాలను ఆమె ధరించారు.

మరోవైపు పెళ్లి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇరు కుటుంబాల్లో పెళ్లి హడావుడి ప్రారంభమైంది. ఇరు కుటుంబాల నుండి కొద్ది మంది అతిథులు మాత్రమే వివాహానికి హాజరవుతున్నారు. అతిథులందరికీ కరోనా పరీక్షలను నిర్వహించనున్నట్టు రానా తండ్రి, నిర్మాత సురేశ్ బాబు తెలిపారు. చెఫ్ లు, సర్వర్ లకు కూడా పరీక్షలు జరుపుతున్నామని చెప్పారు.
Rana
Miheeka Bajaj
Marriage
Haldi Function

More Telugu News