Nara Lokesh: చంద్రబాబు పేరు చరిత్రలో ఉండకూడదని మూడు ముక్కలాటతో విధ్వంసం సృష్టిస్తున్నారా?: లోకేశ్

Nara Lokesh alleges Jagan tries to vanish Chandrababu name as the builder of Amaravathi
  • ఏపీలో రాజధాని రగడ
  • అమరావతిపై టీడీపీ, వైసీపీ మధ్య విమర్శల దాడి
  • అమరావతిని ఎందుకు ధ్వంసం చేస్తున్నారో చెప్పాలన్న లోకేశ్
ఏపీ రాజధాని అంశంపై టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ తాజాగా స్పందించారు. స్థానిక యువతకు ఉపాధి కల్పన, సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని, లంగ్ స్పేస్, గార్డెన్ సిటీతో ప్రపంచానికే తలమానికంగా నవ్యాంధ్రకు రాజధానిగా మహానగరం కడతానని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారంటూ లోకేశ్ సీఎం జగన్ పై విమర్శలు చేశారు.

"నువ్వేం చెప్పావో, అంతకంటే ఘనమైన లక్ష్యాలతో చంద్రబాబు నిర్మించిన అమరావతి ప్రజారాజధానిని ఎందుకు ధ్వంసం చేయాలనుకుంటున్నారో ప్రజలకు వివరించాలి. మీరు నిర్మించాలనుకున్న దానికంటే గొప్ప రాజధానిని చంద్రబాబు నిర్మించారన్న కారణంతో కూలగొడుతున్నారా? అమరావతి నిర్మాతగా చంద్రబాబు పేరు చరిత్రలో ఉండకూడదని మూడు ముక్కలాటతో విధ్వంసం సృష్టిస్తున్నారా? దీనిపై 5 కోట్ల మంది ఆంధ్రులకు సమాధానం చెప్పితీరాలి" అంటూ డిమాండ్ చేశారు.

Nara Lokesh
Jagan
Chandrababu
Amaravati
AP Capital
Andhra Pradesh

More Telugu News