మేలోనే చైనా ఆర్మీ దుందుడుకు చర్యలు.. మోదీ అసత్యాలు చెప్పారన్న రాహుల్ గాంధీ

Thu, Aug 06, 2020, 12:19 PM
why is modi lying asks rahul
  • చైనాతో నెలకొన్న పరిస్థితులను ప్రస్తావించిన రాహుల్
  • గాల్వ‌న్ లోయ వద్ద ఘర్షణకంటే ముందే చైనా దూకుడు
  • మే నెలలో తూర్పు ల‌డ‌ఖ్‌ ప్రాంతంలోకి చైనా ఆర్మీ
  • కూగ్రంగ్ నాలా, గోగ్రా, పాన్‌గంగ్ సో ప్రాంతాల్లోకి చైనా సైనికులు
చైనాతో సరిహద్దుల్లో ఇటీవల నెలకొన్న పరిస్థితులను ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. జూన్ 15వ తేదీన గాల్వ‌న్ లోయ వద్ద చైనా-భారత్ సైనికుల మధ్య జరిగిన ఘ‌ర్ష‌ణ కంటే నెల రోజుల ముందే మే నెలలో తూర్పు ల‌డ‌ఖ్‌ ప్రాంతంలోకి చైనా ఆర్మీ ప్ర‌వేశించిన‌ట్లు తెలుపుతూ వచ్చిన ఓ వార్తను రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు.

ఎల్‌ఏసీ వద్ద భారత భూభాగాన్ని చైనా ద‌ళాలు ఆక్ర‌మించాయని భారత ర‌క్ష‌ణ‌శాఖ మాత్రం ఆ నిజాన్ని దాచిందని రాహుల్ చెప్పారు. కూగ్రంగ్ నాలా, గోగ్రా, పాన్‌గంగ్ సో ప్రాంతాల్లోకి మే నెల 17, 18వ తేదీల్లో చైనా ఆర్మీ వ‌చ్చిన‌ట్లు ర‌క్ష‌ణ శాఖ తెలిపిందని ఓ జాతీయ మీడియా పేర్కొంది. ఈ విషయంపై ప్ర‌ధాని ఎందుకు అసత్యాలు చెబుతున్నార‌ని ఆయన ప్రశ్నించారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha