Kesineni Nani: పార్టీలో అందరూ పాటుపడాలి.. మీడియా సమావేశాల వల్ల ప్రయోజనం లేదు: కేశినేని నాని వ్యాఖ్యలు

tdp has to come for amaravati says kesineni
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అమరావతి రాజధాని నిర్మాణం జరగాలని, అది జరగాలంటే 2024లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావాలని టీడీపీ నేత కేశినేని నాని అన్నారు. ఈ సందర్భంగా మన కలలను మనమే సాకారం చేసుకోవాలని, పార్టీలో అందరూ పాటుపడాలని ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
.
'మన కలలను మనమే సాకారం చేసుకోవాలి. మన కలలను ఎదుటి వారు సాకారం చేయాలని కోరుకోవడం అవివేకం. అమరావతి అనేది చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కన్న కల. అది సాకారం అవ్వాలంటే 2024లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావాలి. ఆ దిశగా పార్టీలో అందరూ పాటుపడాలి. మీడియా సమావేశాల వల్ల, పేపర్ స్టేట్మెంట్స్ వల్ల ప్రయోజనం లేదు' అని కేశినేని నాని ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Kesineni Nani
Telugudesam
Amaravati

More Telugu News