Rajahmundry: రాజమండ్రి సెంట్రల్ జైల్లో 200 మందికి కరోనా?

  • రాజమండ్రి సెంట్రల్ జైలును వణికిస్తున్న కరోనా వైరస్
  • ఇప్పటికే 28 మంది ఖైదీలకు పాజిటివ్
  • 900 మంది ఖైదీల రిపోర్టులు రావాల్సి ఉంది
Corona threat to Rajahmundry Central Jail prisoners

ఏపీలో కరోనా వైరస్ ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తోంది. వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ తొలి స్థానంలో ఉంది. గ్రామాలకు సైతం వైరస్ విస్తరిస్తోందని మంత్రి పెద్దిరెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగించేవే. మరోవైపు జైళ్లలోకి కూడా మహమ్మారి చొచ్చుకుపోతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలులోని ఖైదీలను, సిబ్బందిని కరోనా బెంబేలెత్తిస్తోంది. కరుడుగట్టిన నేరస్తులను సైతం వణికిస్తోంది.

తాజాగా మరో 10 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు 28 మంది ఖైదీలు దీని బారిన పడ్డారు. 900 మంది ఖైదీలకు కరోనా పరీక్షలను నిర్వహించారు. వీరి ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ సాయంత్రానికి టెస్టు రిపోర్టులు రావచ్చని అధికారులు చెపుతున్నారు. మరోవైపు, 200 మంది ఖైదీల వరకు కరోనా పాజిటివ్ వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ సాయంత్రం వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

More Telugu News