పిల్లల్ని కనడంపై ప్రశ్నించిన నెటిజన్ కు అనుష్క శర్మ సమాధానం!

Thu, Aug 06, 2020, 09:30 AM
anushka about her husband kohli
  • ఈ విషయాన్ని ఎవ్వరూ అడగడం లేదు
  • సోషల్‌ మీడియాలోనే చర్చించుకుంటున్నారు
  • ఓడిపోవడం అంటే కోహ్లీకి ఇష్టం ఉండదు
భారత‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మకు పెళ్లి జరిగి మూడేళ్లు అవుతున్నప్పటికీ ఇంకా వీరికి పిల్లలు లేరన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు అనుష్క చాలా కూల్‌గా సమాధానం చెప్పింది.

 పిల్లల్ని ఎప్పుడు కంటారని మీ చుట్టూ ఉండేవారు ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? అని ఓ నెటిజన్ అడిగాడు. దీనికి అనుష్క సమాధానం చెబుతూ.. అడగడం లేదని తెలిపింది. కేవలం సోషల్‌ మీడియాలోనే ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారని సమాధానం ఇచ్చింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో మాట్లాడిన సమయంలో ఆమె ఈ సమాధానం చెప్పింది.

మరో ప్రశ్నకు స్పందిస్తూ, ఓడిపోవడం అంటే కోహ్లీకి ఇష్టం ఉండదని ఆమె తెలిపింది. కోహ్లీ నుంచి ఎలాంటి సాయం తీసుకుంటూ ఉంటారని ఓ అభిమాని అడగగా అనుష్క స్పందిస్తూ... టైట్ గా ఉన్న బాటిళ్ల మూతలు తీయడానికి, బరువైన కుర్చీలు ఎత్తడానికి ఆయన సాయం తీసుకుంటానని చెప్పింది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement