ప్రభాస్ తో భారీ ప్రాజక్ట్ ప్లాన్ చేస్తున్న బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ!

Wed, Aug 05, 2020, 09:37 PM
Bollywood production house to produce a film with Prabhas
  • 'సాహో' తర్వాత మరింత పెరిగిన ప్రభాస్ మార్కెట్ 
  • ప్రభాస్ తో హిందీ సినిమా ప్లాన్ చేస్తున్న టీ-సీరీస్
  • నాగ్ అశ్విన్ సినిమా తర్వాత సెట్స్ కి వెళ్లే ఛాన్స్
ఈవేళ ప్రభాస్ పాన్ ఇండియా హీరో.. బాహుబలి తర్వాత ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన 'సాహో' అనుకున్నంతగా హిట్ కాకపోయినా, ప్రభాస్ ఇమేజ్ మాత్రం చెక్కుచెదరలేదు. జాతీయ స్థాయిలో మార్కెట్ మరింతగా బలపడింది. దీంతో అతనితో డైరెక్ట్ హిందీ చిత్రాలు నిర్మించడానికి బాలీవుడ్ నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ టీ-సీరీస్ అధినేత భూషణ్ కుమార్ ప్రభాస్ తో ఓ పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

వాస్తవానికి ప్రభాస్ తో టీ-సీరీస్ అనుబంధం 'సాహో' చిత్రం నుంచీ కొనసాగుతోంది. ఆ చిత్రాన్ని టీ-సీరీస్ హిందీలో విడుదల చేసింది. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' కూడా ఆ సంస్థే తీసుకుంది. దీంతో ప్రభాస్ తో భూషణ్ కుమార్ కి అనుబంధం ఏర్పడిందనీ, ఆ పరిచయంతో వాళ్లకి సినిమా చేయడానికి ఓకే చెప్పాడనీ అంటున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్టుతో నిర్మించాలని భూషణ్ కుమార్ ప్లాన్ చేస్తున్నాడట. త్వరలో నాగ్ అశ్విన్ తో చేయనున్న చిత్రం తర్వాత టీ- సీరీస్ నిర్మించే చిత్రం సెట్స్ కి వెళుతుందని సమాచారం.  
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha