Kilari Rosaiah: ప్లాస్మాను దానం చేసిన వైసీపీ ఎమ్మెల్యే

YSRCP MLA Kilari Rosaiah donates plasma
  • గుంటూరులో ప్లాస్మా డోనర్ సెల్ ను ప్రారంభించిన రెడ్ క్రాస్ సొసైటీ
  • ప్లాస్మా దానం చేసిన ఎమ్మెల్యే కిలారి రోశయ్య
  • కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదన్న కిలారి
ప్లాస్మాను దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు వైసీపీ పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య. గుంటూరు రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన ప్లాస్మా డోనర్ సెల్ ను ఈరోజు జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మొట్టమొదటగా ఎమ్మెల్యే కిలారి రోశయ్య ప్లాస్మాను దానం చేశారు. ఇటీవలే ఆయన కరోనా నుంచి కోలుకున్నారు.

ఈ సందర్భంగా కిలారి రోశయ్య మాట్లాడుతూ, ప్లాస్మాను దానం చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. కరోనా బాధితులు భయాందోళనలకు గురవుతున్నారని... భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక రకాలుగా కృషి చేస్తోందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... కరోనా నుంచి కోలుకున్న 18 నుంచి 50 ఏళ్ల లోపు పురుషులు ప్లాస్మా ఇచ్చేందుకు అర్హులని చెప్పారు. అందరూ ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఎన్నారై ఆసుపత్రిలో కూడా ప్లాస్మా థెరపీని ప్రారంభించనున్నట్టు తెలిపారు.
Kilari Rosaiah
YSRCP
Plasma
Donation

More Telugu News