Mahesh Babu: మహేశ్ బర్త్ డే రోజున సర్కారు వారి 'పాట'!

Title track from Mahesh movie to be released on his birthday
  • మహేశ్ బాబు తాజా చిత్రం 'సర్కారు వారి పాట' 
  • ఈ నెల 9న మహేశ్ బాబు జన్మదినం 
  • టైటిల్ ట్రాక్ ను విడుదల చేసే ప్రయత్నాలు 
తమ సినిమాలకు సంబంధించిన విశేషాలను వెల్లడించేందుకు ఆయా సినిమాల నిర్మాతలు మంచి సందర్భాలను ఎంచుకుంటూవుంటారు. ఇక తమ హీరో పుట్టిన రోజు వస్తోందంటే చెప్పేక్కర్లేదు. అభిమానులను ఖుషీ చేస్తూ .. తమ సినిమాకు ప్రమోషన్ చేసుకుంటూ.. ఫస్ట్ లుక్ లను, టీజర్ లను, లేకపోతే టైటిల్ ప్రకటనను చేస్తుంటారు.

ఇదే కోవలో ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చిత్ర నిర్మాతలు కూడా తమ హీరో మహేశ్ బాబు జన్మదినం రోజున ఓ సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు. ఈ నెల 9న మహేశ్ జన్మదినం. ఈ సందర్భంగా 'సర్కారు వారి పాట' చిత్రం నిర్మాతలు ఈ సినిమా నుంచి టైటిల్ సాంగును వదలనున్నట్టు తెలుస్తోంది. అభిమానులను ఈ పాట బాగా అలరిస్తుందని భావిస్తున్నారు.

పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ కూడా మరో నాయికగా నటిస్తుందని సమాచారం.
Mahesh Babu
Keerthi Suresh
Parashuram
Thaman

More Telugu News