Sensex: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 24 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 6 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 6 శాతానికి పైగా పెరిగిన టాటా స్టీల్
Stock Markets ends in flat mode

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే భారీ లాభాల్లోకి వెళ్లిన సూచీలు... గంట వ్యవధిలోనే అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఆ తర్వాత ఒడిదుడుకుల్లో ట్రేడ్ అవుతూ చివరకు ఫ్లాట్ గా ముగిశాయి. రేపు ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అవలంబించారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 24 పాయింట్లు నష్టపోయి 37,663కి పడిపోయింది. నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 11,102 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (6.33%), టైటాన్ కంపెనీ (2.85%), మారుతి సుజుకి (2.61%), భారతి ఎయిర్ టెల్ (1.95%), బజాజ్ ఆటో (1.51%).

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.35%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.30%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.14%), టెక్ మహీంద్రా (-0.62%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.59%).

More Telugu News