Sushant Singh Rajput: సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించేందుకు ఒప్పుకున్న కేంద్రం

Centrl govt accepts for CBI probe in Sushant case
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ముంబై పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావని... ఈ కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, సుశాంత్ సొంత రాష్ట్రమైన బీహార్ ప్రభుత్వం కూడా సీబీఐ విచారణ జరిపించాలంటూ కేంద్రానికి సూచించింది. దీంతో, సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలియజేశారు. సీబీఐ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Go Back to Shorts
Sushant Singh Rajput
CBI
Bollywood

More Telugu News