ప్రధాని మోదీ చేతుల మీదుగా ముగిసిన అయోధ్య భూమి పూజ.. మోదీ ముఖంలో వెల్లివిరిసిన ఆనందం!
- అయోధ్యలో ముగిసిన భూమిపూజ కార్యక్రమం
- నక్షత్రాకారంలో ఉన్న ఐదు వెండి ఇటుకల వినియోగం
- ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
ఈ కార్యక్రమంలో నక్షత్రాకారంలో ఉన్న ఐదు వెండి ఇటుకలను ఉపయోగించారు. ఈ ఐదు వెండి ఇటుకలు 5 విగ్రహాలకు ప్రాతినిధ్యం వహిస్తాయని ఆగమశాస్త్ర పండితుల భావన. భూమిపూజలో హరిద్వార్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలం, పుణ్యనదీ జలాలను వినియోగించారు. మరోవైపు భూమిపూజ జరుగుతున్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు.
భూమిపూజ పూర్తైన వెంటనే ప్రధాని మోదీ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. మోదీ, యోగి, మోహన్ భగవత్ లు తమ ఆనందాన్ని పంచుకున్నారు.