Rakul Preet Singh: టాలీవుడ్ బయోపిక్ లో రకుల్ ప్రీత్ సింగ్?

Rakul Preeth Sing signed for Biopick
షార్ట్స్‌లో చూడండి
ఇటీవలి కాలంలో ప్రముఖుల బయోపిక్ లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండడంతో అన్ని భాషల్లోనూ ఈ తరహా చిత్రాల నిర్మాణం జరుగుతోంది. ముఖ్యంగా క్రీడలకు సంబంధించిన వారి బయోపిక్ లకు క్రేజ్ ఎక్కువగా ఉంటోంది. అందుకే, క్రీడారంగ ప్రముఖుల జీవితాలలోని ఆటుపోట్ల చుట్టూ అల్లిన కథలతో బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ వెయిట్ లిఫ్టర్, ఒలింపిక్స్ విజేత, తెలుగు మహిళ అయిన కరణం మల్లేశ్వరి బయోపిక్ కూడా రూపొందుతోంది. ప్రముఖ రచయిత కోన వెంకట్, విశాఖ ఎంపీ ఏమ్వీవీ సత్యనారాయణ కలసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజనా రెడ్డి దర్శకత్వం వహిస్తోంది. ఇక ఇందులో కరణం మల్లేశ్వరి పాత్రకు పలువురిని పరిశీలించిన మీదట తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆమెతో ఒప్పందం కూడా జరిగినట్టు చెబుతున్నారు.  
Go Back to Shorts
Rakul Preet Singh
Kona Venkat
Karanam Malleshvari

More Telugu News