Ayodhya: జన్మభూమికి చేరిన శ్రీరాముని విగ్రహం... తొలి వీడియో ఇదిగో!

Sri Ram Idol at Ram Janmabhoomi
  • నేడు అయోధ్యలో ఆలయ శంకుస్థాపన
  • విగ్రహాన్ని చేర్చిన పూజారులు
  • శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి
100 కోట్ల మందికి పైగా హిందువులు ఎదురుచూస్తున్న క్షణాలు వచ్చేశాయి. అయోధ్యలో అత్యంత వైభవంగా రామాలయం నిర్మాణానికి పూజలు మొదలయ్యాయి. ఈ మధ్యాహ్నం ఆలయ శంకుస్థాపన జరుగనుండగా, శ్రీరాముని విగ్రహాన్ని ఎన్నో ఏళ్ల తరువాత జన్మభూమిగా భావిస్తున్న ప్రాంతానికి చేర్చారు. ఇందుకు సంబంధించిన తొలి వీడియో వైరల్ అవుతోంది. శ్రీరాముని విగ్రహానికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. నేటి మధ్యాహ్నం 12 గంటల తరువాత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆలయ శంకుస్థాపన జరుగనుండగా, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
Ayodhya
Ram Idol
Ayodhya Ram Mandir
Narendra Modi

More Telugu News