Chandrababu: తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటు: వంగపండు మృతిపై చంద్రబాబు

Chandrababu condolences Vangapandu Prasadarao death
  • ప్రజాకవి వంగపండు కన్నుమూత
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు
  • జానపద సాహిత్యాన్ని సుసంపన్నం చేశారని వెల్లడి
ప్రజాకవి వంగపండు ప్రసాదరావు మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వంగపండు మృతి తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. అణగారిన వర్గాలలో చైతన్యం కలిగించేలా జానపద సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన విప్లవకవి అని కీర్తించారు. వంగపండు ప్రసాదరావు ఇకలేరన్న వార్త ఎంతో బాధను కలిగించిందని ట్విట్టర్ లో స్పందించారు. ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి అయినా ఆయన సాహిత్యం విశ్వవ్యాప్తంగా ప్రజలను ఉత్తేజపరిచిందని వివరించారు.
Chandrababu
Vangapandu Prasadarao
Demise
Andhra Pradesh

More Telugu News