Giddalur: మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

YSRCP MLA Anna Venkara Rambabu tests Corona Positive
  • గిద్దలూరు ఎమ్మెల్యే వెంకట రాంబాబుకు కరోనా
  • ఆయన భార్యకు కూడా పాజిటివ్
  • నెల రోజుల క్రితం కరోనా బారిన పడిన రాంబాబు మనవడు
ఏపీలో కరోనా వైరస్ ఏమాత్రం కట్టడి కావడం లేదు. ప్రతి రోజు పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే  అన్నా వెంకట రాంబాబుకు  కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

కరోనా లక్షణాలు కనిపించడంతో తన భార్యతో కలిసి ఒంగోలులోని రమేశ్ సంఘమిత్ర ఆసుపత్రిలో ఆయన పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. ఇతర కుటుంబ సభ్యులకు కోవిడ్ పరీక్షలను నిర్వహించగా నెగెటివ్ గా తేలింది.

ఇటీవలే ఎమ్మెల్యే పుట్టినరోజు జరిగింది. ఈ వేడుకలో ఆయన పాల్గొన్నారు. దీంతో పాటు పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. దీంతో, కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు, నెల రోజుల క్రితం రాంబాబు మనవడికి పాజిటివ్ వచ్చింది. ఆయన ఒంగోలులో చికిత్స పొందారు.
Giddalur
YSRCP MLA
Corona Virus

More Telugu News