సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Tue, Aug 04, 2020, 07:41 AM
Pooja Hegde rejects Nithin movie
  • నితిన్ చిత్రానికి నో చెప్పిన పూజ హెగ్డే
  • బర్త్ డే నాడు చిరంజీవి కొత్త సినిమా
  • ప్రభాస్ కోసం రెడీ అవుతున్న సెట్స్
*  హిందీలో హిట్టయిన 'అంధాదున్' చిత్రాన్ని తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం అడగగా, పూజ హెగ్డే నిరాకరించినట్టు తెలుస్తోంది. పాత్ర నచ్చక తిరస్కరించిందని కొందరంటుంటే.. పారితోషికం సమస్య వల్ల రిజక్ట్ చేసిందని మరికొందరు అంటున్నారు.
*  'ఆచార్య' చిత్రం తర్వాత చిరంజీవి నటించే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెల 22న చిరంజీవి బర్త్ డే నాడు వెలువడుతుందని భావిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి సంబంధించిన ప్రకటనను ఆ రోజు విడుదల చేస్తారని అంటున్నారు.
*  ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీలో 6 కోట్ల వ్యయంతో ఓ భారీ హాస్పిటల్ సెట్స్ ను వేస్తున్నారు. మరో ఇరవై రోజుల్లో దీని నిర్మాణం పూర్తవుతుందనీ, అప్పటి నుంచీ షూటింగ్ చేస్తారని సమాచారం.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha