స్వగ్రామంలో స్కూలు భవనం నిర్మించేందుకు ముందుకొచ్చిన సుకుమార్

Mon, Aug 03, 2020, 08:18 PM
Director Sukumar decides to aid a school building in his native village
  • తూర్పు గోదావరి జిల్లా మట్టుపర్రు సుకుమార్ స్వగ్రామం
  • తండ్రి పేరిట స్కూలు భవనం నిర్మాణం
  • రూ.14 లక్షలు ఖర్చు చేయనున్న సుకుమార్
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సామాజిక సేవపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. స్వగ్రామంలో ఓ స్కూలు బిల్డింగ్ నిర్మించేందుకు ముందుకొచ్చారు. సుకుమార్ తూర్పు గోదావరి జిల్లాలోని మట్టుపర్రు గ్రామానికి చెందిన వ్యక్తి. రాజోలు సమీపంలో ఉండే ఈ ఊరిలో మండల ప్రజాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రాంగణంలో రెండు అంతస్తులతో నూతన భవనం నిర్మించాలని సుకుమార్ నిర్ణయించుకున్నారు. అందుకోసం రూ.14 లక్షలు వెచ్చించనున్నారు. తన తండ్రి  బండ్రెడ్డి తిరుపతినాయుడు పేరిట ఈ భవనం నిర్మించనున్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha