ప్రేయసిని పెళ్లాడిన టాలీవుడ్ యువ దర్శకుడు సుజీత్

Mon, Aug 03, 2020, 07:49 PM
Tollywood director Sujeeth weds Pravallika
  • ఓ ఇంటివాడైన యంగ్ డైరెక్టర్
  • ప్రియురాలు ప్రవల్లిక చేయందుకున్న సుజీత్
  • పెళ్లికి కొద్ది సంఖ్యలో బంధుమిత్రులు హాజరు
'రన్ రాజా రన్' తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని, ఆపై ప్రభాస్ హీరోగా వచ్చిన 'సాహో' చిత్రంతో పాన్ ఇండియా లెవల్లో పేరు సంపాదించిన యువ దర్శకుడు సుజీత్ ఓ ఇంటివాడయ్యాడు. సుజీత్ వివాహం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. తాను ప్రేమించిన అమ్మాయి ప్రవల్లిక మెడలో మూడు ముళ్లు వేశాడు. కరోనా నేపథ్యంలో ఓ మోస్తరు ఆడంబరాలతో జరిగిన ఈ పెళ్లికి పరిమిత సంఖ్యలో బంధుమిత్రులు హాజరయ్యారు. ప్రస్తుతం సుజీత్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha