KCR: సీఎం కేసీఆర్ కు రాఖీలు కట్టిన ఐదుగురు అక్కలు

CM KCR sisters ties Rakhis to their beloved younger brother
  • నేడు రాఖీ పౌర్ణమి
  • ప్రగతి భవన్ కు విచ్చేసిన కేసీఆర్ అక్కలు
  • తోబుట్టువుల ఆశీస్సులు అందుకున్న తెలంగాణ సీఎం
ఇవాళ రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం కేసీఆర్ కూడా తన ఐదుగురు అక్కలతో రాఖీలు కట్టించుకున్నారు. ఆయన అక్కలు వినోదమ్మ, సకలమ్మ, లలితమ్మ, జయమ్మ, లక్ష్మీబాయి తమ సోదరుడు కేసీఆర్ కు రాఖీలు కట్టేందుకు హైదరాబాద్ ప్రగతిభవన్ కు విచ్చేశారు. అందరితో రాఖీలు కట్టించుకున్న సీఎం కేసీఆర్ తన తోబుట్టువుల దీవెనలు అందుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ అర్ధాంగి శోభ కూడా అక్కడే ఉన్నారు.

KCR
Rakhi
Sisters
Pragathi Bhavan
Hyderabad
Telangana

More Telugu News