విశాఖ ఏజెన్సీలో మందుపాతర పేలి ఇద్దరి మృతి

Mon, Aug 03, 2020, 06:06 PM
Land mine blasts in Visakha agency area and two people died
  • పెదబయలు మండలం కొండ్రు సమీపంలో ఘటన
  • ఇద్దరు గిరిజనుల బలి
  • పోలీసులే లక్ష్యంగా మందుపాతర అమర్చినట్టు అనుమానం
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మందుపాతర పేలింది. పెదబయలు మండలం కొండ్రు సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. మృతులను మొండిపల్లి మోహన్ రావు (26), మొండిపల్లి అజయ్ కుమార్ (20) గా గుర్తించారు. వీరు పెదబయలు మండలం చింతలవీధి గ్రామానికి చెందినవారు. కాగా, పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఈ మందుపాతర అమర్చి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులెవరన్నది ఇంకా తెలియరాలేదు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha