Rajanikanth: రజనీకాంత్ కోసం చెన్నైలో పూణే వాతావరణం!

  • సినిమా షూటింగులపై లాక్ డౌన్ ఎఫెక్ట్ 
  • శివ దర్శకత్వంలో రజనీకాంత్ 'అన్నాత్తే'
  • పూణే వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్స్
Sets resembling Pune city ereccted for Rajanikanth

కరోనా ఎఫెక్ట్ సినిమా షూటింగులపై బాగా పడింది. ఎక్కడి షూటింగులు అక్కడే ఆగిపోయాయి. చిత్ర నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నా.. ఆర్టిస్టులు మాత్రం ఇంకా సెట్స్ కి రావడానికి జంకుతూనే వున్నారు. మరికొన్నాళ్లు ఆగండి.. అంటూ నిర్మాతలకు సూచిస్తున్నారు. మరికొన్ని సినిమాల షూటింగులైతే కథ ప్రకారం విదేశాలలోనో.. దేశంలోని మరో ప్రాంతంలోనే చేయాల్సివుంటుంది. ఇలాంటి సినిమాలకైతే మరీ ఇబ్బంది ఏర్పడింది. కథైనా మార్చుకోవాలి.. లేదా ఆ ప్రదేశానికైనా వెళ్లి షూటింగ్ చేసే సాహసమైనా చేయాలి.

ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాకు కూడా ఇలాంటి ఇబ్బందే ఏర్పడింది. శివ దర్శకత్వంలో ప్రస్తుతం రజనీకాంత్ 'అన్నాత్తే' అనే సినిమా చేస్తున్నారు. లాక్ డౌన్ కి ముందు కొంత షూటింగ్ జరిగింది. తదుపరి కీలక షూటింగును కథ ప్రకారం పూణే లో ప్లాన్ చేశారు. ఇంతలో లాక్ డౌన్ రావడంతో ఆగిపోయింది.

ఇప్పుడు అక్కడికి వెళ్లి షూటింగ్ చేయడం అసాధ్యం కాబట్టి.. చెన్నైలోని స్టూడియోలో పూణే వాతావరణాన్ని ప్రతిబించేలా కోట్లాది రూపాయల ఖర్చుతో సెట్స్ వేయడానికి నిర్ణయించుకున్నారట. ఇక ఈ సెట్స్ లో ఆ పూణే షూటింగును కానిచ్చేస్తారని తెలుస్తోంది. అన్నట్టు, ప్రభాస్ నటిస్తున్న 'రాధేశ్యామ్' చిత్రం కోసం కూడా అలాగే రామోజీ ఫిలిం సిటీలో ఇటలీని తలపించే సెట్స్ ను వేస్తున్నారు.

More Telugu News