Amit Shah: అమిత్ షా ఎయిమ్స్ లో చేరకపోవడంపై శశిథరూర్ ఆశ్చర్యం!

Wonder Why Home Minister Chose Not To Go To AIIMS says Shashi Tharoor
  • అమిత్ షాకు కరోనా పాజిటివ్ 
  • గురుగావ్ లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన వైనం
  • ఎయిమ్స్ లో చేరితే ప్రభుత్వాసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలుగుతుందన్న థరూర్

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వెంటనే ఆయన గురుగావ్ లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో, అమిత్ షాపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శలు గుప్పించారు. ఎయిమ్స్ ఆసుపత్రిలో అమిత్ షా చేరకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని వ్యాఖ్యానించారు. అమిత్ షా వంటి వ్యక్తులు ఎయిమ్స్ లో చేరితే... ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

 మరోవైపు తన ఆరోగ్యం బాగుందని అమిత్ షా ట్విట్టర్ ద్వారా నిన్న వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరానని  చెప్పారు. ఇటీవలి కాలంలో తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా ఐసొలేషన్ లోకి వెళ్లాలని,  కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News