భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!

Mon, Aug 03, 2020, 04:01 PM
Stock markets ends in huge losses
  • ఒత్తిడికి గురైన బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు
  • 667 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 181 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈరోజు బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఈ రెండు స్టాకులను అమ్మడానికి ఇన్వెస్టర్లు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 667 పాయింట్లు నష్టపోయి 36,939కి పడిపోయింది. నిఫ్టీ 181 పాయింట్లు కోల్పోయి 10,891కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ కంపెనీ లిమిటెడ్ (3.19%), టాటా స్టీల్ (1.87%), ఎల్ అండ్ టీ (0.37%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.34%), నెస్లే ఇండియా (0.24%).

టాప్ లూజర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (-4.41%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.67%), యాక్సిస్ బ్యాంక్ (-3.30%), ఓఎన్జీసీ (-3.13%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-2.83%).
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha